బీఆర్‌ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
లగచర్లలో సోమవారంపై వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో ఆయన మాజీ ఎమ్మెల్యే కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు.. ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం కలెక్టర్ సహా పలువురు అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.