దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావటంతో మోకిలా పీఎస్‌లో మద్దూరి విజయ్‌పై కేసు నమోదు అయిన విషయం విదితమే. దీంతో ఈ కేసులో నిందితుడిగా విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. విదేశాలకు పారిపోయే అవకాశముందన్న సమాచారంతో విజయ్‌కి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
డ్రగ్స్‌పైనే ప్రధాన ఫోకస్..
ఈ కేసులో విచారణ జరుగుతుండడంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చేయన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ఇంతకీ డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడు? ఆయన ఫోన్ విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాడట. పట్టుబడిన రోజు తన ఫోన్ కాకుండా, మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు అందజేశాడు. దీనిపై మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పోలీసులకు కీలక సమాచారం..
విజయ్ ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అరెస్ట్ కాకుండా ముందగా న్యాయస్థానాన్ని సంప్రదించాడు. విచారణకు సహకరించకుండా మరో దేశానికి వెళ్తాడనే సమాచారం పోలీసులకు వచ్చింది. విదేశీ మద్యం కొనుగోలు, డ్రగ్స్‌పై ఎవరి దగ్గర తీసుకున్నాడనేది తేలితే ఈ కేసు ముగింపు రావడం ఖాయమని అంటున్నారు.