AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న క్రిష్.. పెళ్లి ఫొటోలు వైరల్

టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు క్రిష్. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 చిత్రానికి మొట్టమొదటి దర్శకుడిగా పని చేసిన క్రిష్.. బాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. డైరెక్టర్‌గా తిరుగులేని స్టార్ డమ్ ఉన్న క్రిష్ వైవాహిక జీవితంలో మాత్రం ఇప్పటికే ఒక పెళ్లి చేసుకుని, విడాకులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇంతకు ముందు డాక్టర్ రమ్య వెలగ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న క్రిష్, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో డాక్టర్ అయిన ప్రీతి చల్లాను రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి కొన్ని రోజులుగా డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ క్రిష్ సైడ్ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు పెళ్లి అనంతరం కొన్ని ఫొటోలతో కూడిన ఓ వీడియోను వారు షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10