AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు ఢిల్లీకి కేటీఆర్‌.. కేంద్రమంత్రిని కలిసేందుకు హస్తినకు పయనం

అమృత్‌పథకం టెండర్లలో గోల్‌మాల్‌ అంటూ ఫిర్యాదు!
విచారణ జరపాలని డిమాండ్‌

ఢిలీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ అతని బృందంతో మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కేటీఆర్‌ కలవనున్నారు. అమృత్‌ టెండర్ల విషయంలో కేంద్రమంత్రికి కేటీఆర్‌ ఫిర్యాదు చేయనున్నారు. అమృత్‌ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని సృజన్‌ రెడ్డిపై కేటీఆర్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రూ. 8,888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్‌ ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బామ్మర్ధి సృజన్‌ రెడ్డికి టెండర్లు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోంది. అమృత్‌ టెండర్లపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేటీఆర్‌ కోరుతున్నారు.

అక్రమాలు వెలికి తీయాలి..
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అమృత్‌ పథకం టెండర్లపై విచారణ జరిపి అక్రమాలు వెలికి తీయాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రులు మనోహర్‌లాల్‌ ఖట్టర్, టోచన్‌ సాహులకు లేఖ రాశారు. దీనిపై విచారణ చేసి నిజనిజాలు నిగ్గుతేల్చాలని లేకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం పాల్పడే అవినీతిలో కేంద్రానికీ వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు లేఖ రాసిన విషయాన్ని కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు.  ఈ పథకం కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ.1500కోట్ల విలువైన పనలను సీఎం రేవంత్‌ తన కుటుంబసభ్యులకే కేటాయించుకున్నారని ఆరోపిస్తూ కేటీఆర్‌ లేఖ రాశారు.

అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు..
‘అమృత్‌ టెండర్ల అవినీతికి సంబంధించి కేంద్ర మంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్, టోచన్‌ సాహుకు లేఖ రాశా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి తగిన అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు కట్టబెట్టారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలపై నిజానిజాలు వెలికితీసేందుకు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నా. గత కొన్ని నెలలుగా కేటాయించిన ఈ టెండర్ల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిస్తోంది. అమృత్‌ పథకం కింద టెండర్లు పొందిన కంపెనీల వివరాలపై దర్యాప్తు చేసి బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ప్రతీ టెండర్‌ను పరిశీలించాలని, అక్రమాలు జరిగినట్లు తేలితే వెంటనే వాటిని రద్దు చేయాలని కోరా. ఈ టెండర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌ లో అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నా. అర్హతలు లేకపోయినా అమృత్‌ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపై విచారణ జరపాలి’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10