మాములుగా మనకు ఒకరిద్దరు స్టార్ హీరోలు కనిపిస్తేనే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటిది ఒకేసారి ఐదారుగురు పెద్ద స్టార్స్ ఒకేసారి సరదాగా గడపడం.. ఆ ఫొటో బయటకు వస్తే ఇక ఫ్యాన్స్ సంబరానికి ఆకాశమే హద్దుగా ఉంటుంది. అలాంటి దృశ్యమే గురువారం సంభవించింది. దీంతో ఫ్యాన్స్ ఆ ఫొటోను ట్రెండింగ్ చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), మహేశ్‌బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan), అఖిల్ (Akhli Akkineni), ఉపాసన (Upasana), నమ్రత (Namrata) ఇలా వీరంతా మాల్దీవుల్లో ఓ బిజినెస్ మేన్ జన్మదిన వేడుక కోసం వెళ్లి అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోను నమ్రత తన ఇన్ స్టాలో షేర్ చేయగా ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.