AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాటు బాంబు, లక్ష్మీబాంబు కాదు.. ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది: మంత్రి పొంగులేటి

దీపావళికి ఒకటో రెండో పొలిటికల్ బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారి సంచలనంగా మారాయి. అయితే.. దీపావళికి ఎలాంటి బాంబులు పేలకపోవటంతో.. ఆయన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. కాగా.. కచ్చితంగా బాంబులు పేలతాయని వారి కామెంట్లు ఇప్పటికే కౌంటర్ ఇచ్చిన మంత్రి పొంగులేటి.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటు బాంబు, లక్ష్మీ బాంబు కాదు.. త్వరలో ఆటమ్ బాంబే పేలబోతోందంటూ మంత్రి పొంగులేటి మరోసారి సంచలన కామెంట్ వదిలారు.

“నాటు బాంబు, లక్ష్మీబాంబు కాదు.. త్వరలో ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే.. కొందరు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయి.” అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా వన్ కార్ రేసింగ్ విషయంలో నిధుల విడుదల వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ కీలక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే.. ఫార్ముల్ వన్ కార్ రేసింగ్ జరిగిన సమయంలో.. కేటీఆర్ మంత్రిగా ఉండగా.. ఆయన సమక్షంలోనే.. ఆయన ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామంటూ అధికారులు కూడా తెలిపినట్టుగా ఈడీ పేర్కొంటోంది. కాగా.. ఈ విషయంలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారని.. అరెస్టుకు రంగం సిద్ధమైందని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా.. గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇదే విషయంపై ఆయనతో చర్చించి అనుమతి తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10