మూడు రోజుల పాటు అక్కడే..
హైడ్రా బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలోని ‘హైడ్రా’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనున్నారు.
మూడు రోజుల పాటు స్టడీ..
కర్ణాటక ప్రభుత్వంతో పాటు సీఎస్‌ఆర్ కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను మూడు రోజుల పాటు స్టడీ చేయనున్నారు. తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనున్నారు. బాచుపల్లి ఎర్రగుంట చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువు, రాజేంద్రనగర్ అప్ప చెరువులకు హైడ్రా పునరుజ్జీవం తేనుంది.