AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇండియన్ మహిళా.. మజాకా.. తుపాకీ గురిపెట్టిన దొంగకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..

తుపాకీ గురి పెట్టి బెదిరించడం, మాట వినకపోతే కాల్చేయడం వంటి ఘటనలు విదేశాల్లో తరచూ చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోర్‌లోకి చొరబడిన ఓ దొంగ క్యాష్ కౌంటర్‌లో ఉన్న భారతీయ మహిళపై తుపాకీ గురిపెట్టాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇండియన్ స్టోర్‌లో (Indian Store) జరిగిన వింత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ దొంగ స్టోర్‌లోకి చొరబడి నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్తాడు. తాను కొన్న వాటికి సంబంధించిన డబ్బులను ఆమె చేతికి ఇస్తాడు. అతడు ఇచ్చిన డబ్బులు తీసుకుని, కంప్యూటర్‌లో నమోదు చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

అప్పటిదాకా కామ్‌గా ఉన్న అతను.. ఒక్కసారిగా తన చొక్కా కింద దాచుకున్న తుపాకీని బయటికి తీస్తాడు. గన్‌‌ను ఆమెకు గురిపెట్టి, (Robber points gun at Indian woman) కౌంటర్‌లోని క్యాష్ బయటికి తీయాలని బెదిరిస్తాడు. అయితే ఆమె మాత్రం ఏమాత్రం భయపడకుండా అతడి తుపాకీకి ఎదురు నిలుస్తుంది. తుపాకీని పక్కకు నెట్టి, అతడిపై ఎదరుదాడి చేస్తుంది. అతడు షూట్ చేయాలని ప్రయత్నించినా ఆమె ఎంతో చాకచక్యంగా అతడిపై రివర్స్ అటాక్ చేస్తుంది.

ఆ తర్వాత ప్టాస్టిక్ బాక్స్ తీసుకుని అతడిని బలంగా కొడుతుంది. ఆ దొంగపై పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో చివరకు అతను ఆమె దెబ్బలను తాళలేక అక్కడి నుంచి పారిపోతాడు. దొంగ పారిపోతున్నా కూడా వదలకుండా మళ్లీ వెంటపడుతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండియన్ మహిళా.. మజాకా’’.. అంటూ కొందరు, ‘‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10