AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫ్లోరిడాలో మెలానియాతో ఓటేసిన ట్రంప్‌.. గెలుపుపై విశ్వాసంతో..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా సై అన్నట్టుగా ఎన్నికల్లో తలపడుతున్నారు.

ఎవరికి వారు గెలపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఓటింగ్ ప్రాంగణానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన తర్వాత.. ట్రంప్ తన గెలుపు అవకాశాలపై బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను చాలా నమ్మకంగా ఉన్నాను. మేము ప్రతిచోటా చాలా బాగా బలంగా ఉన్నామని నేను విన్నాను. మా ఎన్నికల ప్రచారం అత్యుద్భుతంగా ఉంది” అని అభివర్ణించారు. ఆపై ట్రంప్ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని అంచనా వేశారు.

78 ఏళ్ల ట్రంప్.. రిపబ్లికన్లు ఓటు వేసేందుకు భారీఎత్తున క్యూలో బారులు తీరడం చాలా గౌరవంగా ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ, మెయిల్-ఇన్ బ్యాలెట్లతో ఫలితాల ఆలస్యం గురించి ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ వేగవంతమైన ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. ఓటింగ్ యంత్రాలలో పెట్టుబడులు ఉన్నప్పటికీ, అమెరికా ఇప్పటికీ సుదీర్ఘమైన లెక్కింపు సమయాలను ఎదుర్కొంటుంది.

“అలాంటిది ఎప్పుడూ జరగకూడదు” రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అన్నారు. అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందరితో కలుపుకొని ఉండాలనుకుంటున్నామని తెలిపారు.

హింసను నివారించాలని తన మద్దతుదారులను కోరుతున్నారా అని అడిగినప్పుడు.. ట్రంప్ తన మద్దతుదారులను “హింసాత్మక వ్యక్తులు కాదు” అని అభివర్ణించారు. “నేను కచ్చితంగా హింసను కోరుకోను. కానీ, నేను ఖచ్చితంగా గొప్ప వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు” అని ట్రంప్ స్పష్టంచేశారు.

 

మరోవైపు.. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ తన ఓటు వేశారు. సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో మెయిల్‌ ద్వారా హారిస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ కూడా ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటిలోని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10