రాత్రి బువ్వ తీనే సమయంలో పొద్దున మిగి లిన బువ్వ పెట్టారని ప్రశ్నించిన తండ్రిని వా తలు వచ్చేలా కొడుకులు కొట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. మానవపాడు మండల పరిధిలోని జలా ్లపురం గ్రామానికి చెందిన గుర్రంబండి నాయ క కృష్ణయ్య కొన్నేళ్లుగా గుర్రం బండి నడుపు తుండేవాడు. గత ఎడాది వ్యవసాయ భూమి అమ్మి వచ్చిన నగదును కుమారులు వెంకటేష్, బీచుపల్లిలకు సమానంగా పంచా డు. 70 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన భార్య ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందింది.
దీంతో కుమారుల దగ్గరే ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయనకు ఇంట్లో సరైన వసతులు, భోజనం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. రానురాను పగలు చేసిన బువ్వ మిగిలితే రాత్రికి, రాత్రి చేసిన బువ్వను ఉదయం పెట్టేవారని వాపోయాడు. బుధవా రం కూడా పగలు చేసిన బువ్వను రాత్రికి పెట్టారు. దీంతో అన్నం సద్దిపడిందని కోడళ్లు, కోడుకులకు కృష్ణయ్య చెప్పాడు. దీంతో ఇద్దరు కొడుకులు ఆగ్రహంతో వాతలు వచ్చేలా కొట్టారు. ఈ విషయంపై అదే రాత్రి పోలీసుల కు బాధితుడు చెప్పడంతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రకాంత్ తెలిపారు. కుమారులను స్టేషన్‌కు పిలిచి తండ్రిని సరిగాచూసుకోవాలని మందలించి బాధితుడిని ఇంటికి పంపారు.









