AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీహెచ్‌ఎంసీకి కొత్త కమిషనర్‌.. ఆమ్రపాలి స్థానంలో ఇలంబర్తి..

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్ట్‌ చేయాలని పలువురు ఐఏఎస్ అధికారులకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని.. ప్రస్తుతం తాము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడే ఉంచాలని కోరుతూ పలువురు ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌, హైకోర్టును ఆశ్రయించినా వారికి అక్కడ ఎదురుదెబ్బే తగిలింది. దీంతో వారు తమ స్థానాల నుంచి రిలీవ్ అయి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా ఖాళీ అయిన స్థానాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది.

ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి కాట.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తితో భర్తీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు వెలువరించారు. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా.. మహిళా సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి.. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌.. ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ANN TOP 10