AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంక్ బండ్‌పై స్పెషల్ లేజర్ షో

సద్దుల బతుకమ్మ కోసం ఊరూవాడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది.

తెలంగాణలో బతుకమ్మ  వేడుకలు అంటరాన్నంటుతున్నాయి. ఈరోజుతో బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకోనున్నారు మహిళలు. సద్దుల బతుకమ్మ కోసం ఊరూవాడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటారు. ఈ క్రమంలో బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది.

ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై లేజర్, క్రాకర్స్ షోను నిర్వహించనున్నారు. దాదాపు10 వేల మంది మహిళలతో భారీ ర్యాలీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు మహిళలు. అయితే సీఎం సహా ప్రముఖులు బతుకమ్మ వేడుకలకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10