హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జులానా స్థానం (Julana Assembly Seat) నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వినేష్ ఫొగాట్ (Vinesh Phogat) విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై వినేష్ గెలుపొందారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. ఒకానొక సమయంలో వినేష్ ఫొగాట్ వెనుకంజలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ పుంజుకుని లీడింగ్‌లోకి వచ్చారు. ఆరు వేల పైచిలుకు ఓట్లతో యోగేష్‌పై రెజ్లర్ విజయం సాధించారు.
మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఇక్కడ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. బీజేపీ 49 స్థానల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 35 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఐఎన్ఎల్డీ రెండు స్థానాల్లో, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.