మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్సీఏలో అవకతవకలకు సంబంధించి ఆయనకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో ఈరోజు ఉదయం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు.
విచారణ అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ… తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.