మూసీ పరివాహక బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ బృందం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం హైదర్ షా కోటకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు, సబిత ఇంద్రా రెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదర్ కోట వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం చేరుకోవడంతో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు, సబిత ఇంద్రా రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.