AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పండగల వేళ రైల్వే గుడ్‌ న్యూస్‌…6 వేల స్పెషల్‌ ట్రైన్లు!

దేశంలో దసరా, దీపావళి పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. పండుగల సీజన్ కావడంతో దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల కోసం ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్దమవుతుంటారు. ఈ క్రమంలో.. భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు జత చేశారు. పండుగల సమయంలో కనిపించే అదనపు రద్దీని తగ్గించడానికి 12,500 కోచ్‌లను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల సమయంలో ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు వెళ్లే మార్గాల్లో భారీ రద్దీ నెలకొనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది పండగ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 5,975 ప్రత్యేక రైళ్లను నోటిఫై చేశామని.. గతేడాది 4,429 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

“ఈ పండగల సమయంలో కోటి మందికి పైగా ప్రయాణికులు ఇంటికి వెళ్ళడానికి ఇది సులభతరం చేస్తుంది” అని ఆయన చెప్పారు. దుర్గాపూజ అక్టోబర్ 9 న ప్రారంభమవుతుంది.. దీపావళి అక్టోబర్ 31న జరుపుకోనున్నారు. ఛత్ పూజ నవంబర్ 7, 8 తేదీలలో జరుగుతుంది.

ANN TOP 10