మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద సంగారెడ్డి ప్రధాన రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ పట్టణానికి చెందిన రెండు ప్రైవేట్ కాలేజీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లతో సహా పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బివిఆర్ ఐ టి కళాశాలకు చెందిన బస్సులు రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక వాహనంలోన డ్రైవర్ మృతి చెందినట్టుగా తెలిసింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించపోయి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీ కొట్టినట్టుగా తెలిసింది. గాయపడిన విద్యార్థులను స్థానిక నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..