AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులు బీ అలర్ట్!

గణపతి నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు నిమజ్జనం రోజైన ఈ నెల 17వ తేదీన అమల్లోకి వస్తాయి. మంగళవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

హైదరాబాద్ పోలీసు పరిధిలో ఆంక్షలు ఇలా ఉంటాయి. కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, ఇంజిన్ బౌలీ, శంశీర్‌గంజ్, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొగల్‌పురా, లక్కడ్ కోటె, పంచ్ మొహలా, పారిస్ కేఫ్, గుల్జర్ హౌజ్, మిట్టి కా షేర్, కాలి కమాన్, ఒస్మాన్ బజార్, షెరాన్ హోటల్, మదీనా క్రాస్ రోడ్స్, నయాపూల్, ఎస్ జే రోటరీ, అర్మాన్ హోటల్, ఎంజే బ్రిడ్జీ, దారుల్ షిఫా క్రాస్ రోడ్స్, సిటీ కాలేజీ, శివాజీ బ్రిడ్జీ, అఫ్జల్ గంజ్, పుత్లి బౌలి క్రాస్ రోడ్స్, ట్రూప్ బజార్, జాంబాగ్ క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ కోఠీ ఏరియాల్లో ఈ ఆంక్షలు ఉంటాయి.

అలాగే.. తోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, అజంతా గేట్, అబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, చాపెల్ రోడ్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, జీపీవో అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి స్టాచ్యూ, కవాడిగూడ, నారాయణగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ఏరియాల్లో ఆంక్షలు ఉంటాయి. మరికొన్ని చోట్లా ఈ ఆంక్షలు ఉండనున్నాయి.

ANN TOP 10