AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 41.60 అడుగుల వద్ద 8,72,255 క్యూసెక్కులకు వరద ఉధృతి చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఇక రాజమండ్రి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. నీటి మట్టం 8.20 అడుగులకు పెరిగింది. 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 5.25 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

ములుగు వద్ద కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 12 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ ఫ్లో వచ్చేసి 2, 20, 544 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 1, 38, 433 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 589 అడుగులకు చేరుకుంది. మంచిర్యాలలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 80 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 89వేల క్యూ సెక్కులు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ :18.8695 టీఎంసీలకు చేరుకుంది.

 

ANN TOP 10