తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు పోలీస్ కమిషనర్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విజిలెన్స్ డీజీగా ఆయనను నియమించింది. సీవీ ఆనంద్ స్థానంలో ఏసీపీ డీజీగా విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం అపాయింట్ చేసింది.
మహేష్ భగవత్‌కు ADG పర్సనల్ అండ్ వెల్ఫేర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ గా రమేశ్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.