తెలంగాణ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం కాగా.. మరోసారి భారీవర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వివిధ జిల్లాల్లో పింక్, రెడ్, గ్రీన్ అలెర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో వర్షాలు పడి.. ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోసారి అలాంటి సంకేతాలు ఉన్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ చెబుతోంది.
కుమరంభీమ్ అసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD చెబుతోంది. ఈ జిల్లాల్లో పింక్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రభుత్వం కూడా ఆయా ప్రాంతాల్లో అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. IMD హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పింక్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశంతో పాటు వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD చెబుతోంది.