AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నెక్స్ట్ టార్గెట్..? బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు

చెరువుల చుట్టూ కబ్జాలకు గురైన భూములను కాపాడుతోంది హైడ్రా. ఇప్పటిదాకా 160 నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో ఆక్రమణకు గురైన 165 ఎకరాల దాకా స్వాధీనం చేసుకున్నట్టయింది. ఇంకా, కొన్ని అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసిన హైడ్రా, కూల్చివేతలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

పోచారం పీఎస్‌లో కేసు
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేసినందుకు, ఎఫ్‌టీఎల్‌లో మెడికల్ కాలేజ్ కట్టారని, ఇరిగేషన్ ఏఈ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు పోలీసులు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

కబ్జా వివాదం ఇదే!
ఘట్‌కేసర్ మండలంలోని వెంకటాపూర్‌లో సర్వే నెంబర్ 813లో నాదెం చెరువు ఉంది. దీని బఫర్ జోన్ పరిధిలో పల్లా రజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజీ, ఇతర నిర్మాణాలు చేపట్టారని, గణేష్ నాయక్ అనే వ్యక్తి మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ వాఖ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై సరైన స్పందన లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు కదిలారు. పోచారం పీఎస్‌లో కంప్లయింట్ చేశారు.

ఎకరన్నర భూమి ఆక్రమణ
సుమారు 60 ఎకరాల నాదెం చెరువుకు సంబంధించి 14 ఎకరాల బఫర్ జోన్ ఉంది. ఈ బఫర్ జోన్‌లో సుమారు ఎకరన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్‌స్టిట్యూషన్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందనేది ఆరోపణ. ఓవైపు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ ఫాంహౌస్‌గా చెబుతున్న జన్వాడ భవనంపై వివాదం కొనసాగుతోంది. దాన్ని కూడా హైడ్రా కూల్చివేస్తుందని అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10