పసిడి ప్రియులకు అలర్ట్
మళ్లీ పెరిగిన బంగారం ధర
రెండ్రోజుల్లో రూ.1000 జంప్
నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగానే దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. రెండ్రోజుల్లోనే తులం రేటు రూ.1000 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరి ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ రేటు ఎంత పలుకుతుందో తెలుుకుందాం.
బంగారం కొనుగోలుదారులకు వరుస షాకులు తగులుతున్నాయి. పసిడి ధర భారీగా తగ్గింది కదా అని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారిని ధరల పెరుగుదల బెంబేలెత్తిస్తోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు ఒక్కసారిగా పెరగడం, దేశీయంగా పెళ్ళిళ్ల గిరాకీ పెరగడమే ఇందుకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితూ బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయంటున్నారు. పసిడితో పాటు వెండి ధరలు సైతం వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్లు వరుసగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. అయినప్పటికీ రెండు నెలల క్రితం నాటి గరిష్ఠాల కన్నా దిగువనే ఉండడం కాస్త ఊరటగా చెప్పవచ్చు. అయితే, మళ్లీ ఆ స్థాయిని చేరుకునేందుకు అంత పెద్దగా టైం పట్టకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ అంటే ఆగస్టు 11వ తేదీన హైరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 64,600కి చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,460కు చేరుకుంది. ఇక నేడు వెండి రేట్లు కూడా స్థిరంగా ఉండగా, కిలో వెండి ధర రూ.83,100గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)
ఢిల్లీలో రూ.70,460, రూ. 64,600
హైదరాబాద్లో రూ. 70,310, రూ. 64,450
విజయవాడలో రూ. 70,310, రూ. 64,450
చెన్నైలో రూ. 70,310, రూ. 64,450
ముంబైలో రూ. 70,310, రూ. 64,450
బెంగళూరులో రూ. 70,310, రూ. 64,450
కోల్కతాలో రూ. 70,310, రూ. 64,450
కేరళలో రూ. 70,310, రూ. 64,450
దేశంలో కీలక నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
బెంగళూరులో రూ. 80,650
హైదరాబాద్లో రూ. 88,100
విజయవాడలో రూ. 88,100
ఢిల్లీలో రూ. 83,100
చెన్నైలో రూ. 88,100
గోవాలో రూ. 80,650
కేరళలో రూ. 88,100
వారణాసిలో రూ. 83,100
గమనిక: మార్కెట్ వర్తకుల అభిప్రాయం ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ ప్రపంచ మార్కెట్లో ధోరణుల నేపథ్యంలో మారుతూ ఉంటాయి. కాబట్టి బంగారం, వెండి తీసుకునే విషయంలో మళ్లీ రేట్ల గురించి తెలుసుకోవాలని సూచన.