కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతయ్యారు. కేదార్‌నాథ్‌లో 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గౌరీకుండ్ – కేదార్‌నాథ్ దారిలో భక్తులు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 3 వేల మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో సహాయక బృందాలు గాలిస్తున్నాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి.









