AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీది హాఫ్‌ నాలెడ్జ్‌.. నీవు డమ్మీవి.. హరీశ్, కోమటిరెడ్డిల మధ్య మాటల యుద్ధం

అసెంబ్లీలో హాట్‌హాట్‌ చర్చ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
అసెంబ్లీలో శనివారం చర్చ హాట్‌హాట్‌గా కొనసాగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్‌ నాలెడ్జ్‌తో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఉన్నాడని హరీశ్‌రావు అంటే.. రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. వెంటనే కోమటిరెడ్డి లేచి నీకు ఆకారం పెరిగింది తప్పితే తెలివి పెరగలేదంటూ హరీశ్‌రావుపై విరుచుకుపడ్డారు. ‘మీ మామ దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండా? లేదా?’ అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఇద్దరి మధ్య సభలో గట్టి సంవాదమే నడిచింది.

2001లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తామని చెప్పి అబద్ధాలను ఆనాటి టీఆర్‌ఎస్‌ ప్రస్తుత బీఆర్‌ఎస్‌ మొదలు పెట్టిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్‌ ఇచ్చామని చెబితే తాను ఓ సబ్‌ స్టేషన్‌ కు వెళ్లి పరిశీలించానని అక్కడే పని చేసే ఆపరేటర్‌ 9 ఏళ్ల నుంచి ఏనాడు 14 గంటల విద్యుత్‌ సప్లై కాలేదని చెప్పారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. మోసాలు, అబద్ధాలు బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడిన నాటి నుంచే పుట్టాయని మంత్రి సెటైర్లు వేశారు.

సంతో పశువులను కొన్నట్లు..
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు ఆనాడు కొని కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ బడ్జెట్‌పై చీల్చిచెండాడుతాడని పత్రికల్లో వార్తలు వస్తే తాను తొమ్మిది గంటలకు వచ్చి కూర్చున్నానని అయితే కేసీఆర్‌ కు వచ్చే మొఖం లేక హరీష్‌ రావును పంపారన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందిస్తూ.. కోమటిరెడ్డికి ‘హాఫ్‌ నాలెడ్జ్‌’ ఉందనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ కల్పించుకుని హాఫ్‌ నాలెడ్జ్‌ పదం విరమించుకోవాలని హరీష్‌ రావును కోరి రికార్డుల నుంచి తొలగించారు. దీనికి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హరీష్‌ రావుకు ఆకారం పెరిగిందని అసలు నాలేడ్జ్‌ లేదని కౌంటర్‌ ఇచ్చారు.

ANN TOP 10