AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ.. జులై 30కి వాయిదా

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన ఫిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. బీఆర్‌ఎస్, తరపున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు.

స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టు తీర్పులో ఉన్నా అమలు చేయలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ మేరకు పలు మార్లు కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా చదివి వినిపించారు. వాదనల విన్న కోర్టు జులై 30 వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

ANN TOP 10