AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన కే. కేశవరావు

ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశ‌వ‌రావుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఆయ‌న‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప‌బ్లిక్ అఫైర్స్ స‌ల‌హాదారుగా ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. కే కేశ‌వ‌రావుకు క్యాబినెట్ హోదా క‌ల్పిస్తున్న‌ట్లు జూన్ 06, 2024న ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ మేరకు శనివారం సెక్రెటేరియట్ లో తెలంగాణ ప్రభుత్వ సలహా దారుడిగా కే. కేశవరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయం లో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు కే.కేశవరావు ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ANN TOP 10