AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ .. మరో రెండు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశముందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో బుధవారం అత్యధికంగా 6.40 సెం.మీ వర్షం కురిసింది.

ANN TOP 10