AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశ ప్రక్రియ టీజీ ఎప్‌సెట్ ద్వారా కొనసాగుతుంది. ఇప్పటికే ఎప్‌సెట్ ర్యాంకులను ప్రకటించగా.. గురువారం(జులై 4) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 4 నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండగా.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు జులై 6 నుంచి జులై 13 మధ్య తేదీల్లో విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందని ఎప్‌సెట్ బోర్డు పేర్కొంది.

జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నమోదు చేసుకోడానికి వీలు కల్పించింది. 15వ తేదీ వెబ్ ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ ప్రక్రియలో సీట్ల కేటాయింపు జులై 19న జరగనుంది. ఇక కేటాయించిన కాలేజీలో ఫీజు చెల్లింపు, రిపోర్టింగ్‌కు విద్యార్ధులు జులై 19 నుంచి 23 వరకు అవకాశం కల్పించారు.

ANN TOP 10