ఖర్గే సమక్షంలో చేరనున్న నేత
మరికొందరు కూడా చేరే అవకాశం
మంత్రివర్గం కూర్పుపై కసరత్తు పూర్తి
నేడు ఖర్గే, రాహుల్‌తో చర్చించనున్న రేవంత్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ శరవేగంగా జరుగుతోంది. అంతే వేగంగా కాంగ్రెస్‌లోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు చేరికల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు చేరనున్నారు. ఆ వెంటనే రాజ్యసభకు రాజీనామా చేయనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై ఖర్గే, రాహుల్ తో రేవంత్ చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి కే కేశవరావు బుధవారంæ ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు..
బీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేకే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేకేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం కేకేతో పాటు ఆమె కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్‌ఎస్ ను వీడారు. విజయలక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోగా కేకే మాత్రం ఇంకా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కేకే ఒక్కరే చేరుతారా? లేక ఇంకా ఎవరైనా చేరబోతున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది.
సాయంత్రం ఖర్గేతో రేవంత్ భేటీ:
కొన్ని రోజులుగా తెలంగాణ మత్రి వర్గ విస్తరణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మంత్రి వర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండితో ఆషాడ మాసం మొదలు కాబోతున్నది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో చోటు, పీసీసీగా ఛా¯Œ ్స కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నందున అధిష్టానం ఎవరికి ఎస్ చెప్పబోతున్నదని మరెవరికి నో చెప్పనున్నదనేది కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్‌గా మారింది.









