రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న జరుగనున్నది. ఈ నేపథ్యంలో నీతా అంబానీ వారణాసిలో పర్యటించారు. తొలుత కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకుని వివాహ ఆహ్వాన పత్రికను విశ్వనాథుడికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.
దాదాపు పదేండ్ల తర్వాత తాను వారణాసికి వచ్చానని నీతా అంబానీ చెప్పారు. వారణాసిలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే తనకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నీతా అంబానీకి ఒక వ్యక్తి విశ్వనాథ ఆలయ నమునా చిత్ర పటాన్ని బహూకరించారు. అటుపై నీతా అంబానీ అక్కడ ఒక చాట్ దుకాణానికి వెళ్లి పాలక్ చాట్ రుచి చూశారు.