(అమ్మన్యూస్, పశ్చిమబెంగాల్):
పశ్చిమబెంగాల్లోని డార్జీలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నారు. ఈవిషయాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50వేలు చొప్పున ఇస్తామని తెలిపారు. సోమవారం ఉదయం బెంగాల్ లోని సిల్దా నుంచి వెళ్తున్న కాంచన్జంగా ఎక్సస్ను ఓ గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికు చనిపోయారు. మరో 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
సిగ్నల్ షాట్ వల్లే ప్రమాదం..
బెంగాల్ రైలు ప్రమాదానికి కారణం సిగ్నల్ ఓవర్ షాట్ అని భావిస్తున్నారు అధికారులు. అంటే సిగ్నల్ వ్యవస్థలో ఒక్కసారిగా వోల్టేజ్ పెరగడంతో.. సిగ్నల్ మారి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మానవ తప్పిందం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, సిగ్నల్స్ పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే బోర్డు సీఈవో జయా వర్మ సిన్హా తెలిపారు.









