AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

20 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం
పలువురికి పోస్టింగులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీలు జరిగాయి. ఏకంగా 20 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు ఐఏఎస్‌ లకు పోస్టింగులు ఇచ్చింది.

కరీంనగర్‌ కలెక్టర్‌ గా అనురాగ్‌ జయంతిని నియమించింది.
ఖమ్మం కలెక్టర్‌ గా ముజామిల్‌ ఖాన్‌
నారాయణపేట కలెక్టర్‌ గా సిక్తా పట్నాయక్‌
నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ గా బదావత్‌ సంతోష్‌
రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ గా సందీప్‌ కుమార్‌ ఝా
కామారెడ్డి కలెక్టర్‌ గా ఆశీష్‌ సంగ్వాన్‌
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ గా జితేష్‌ వి పాటిల్‌
జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ గా రాహుల్‌ శర్మ
హన్మకొండ కలెక్టర్‌ గా ప్రావిణ్య..
జగిత్యాల కలెక్టర్‌ గా బుడుమాజి సత్యప్రసాద్‌
పెద్దపల్లి కలెక్టర్‌ గా కోయం శ్రీహర్ష
మంచిర్యాల కలెక్టర్‌ గా కుమార్‌ దీపక్‌
నల్గొండ కలెక్టర్‌గా నారాయణరెడ్డి
వికారాబాద్‌ కలెక్టర్‌ గా ప్రతిక్‌ జైన్‌
ములుగు కలెక్టర్‌ గా దివాకర్‌
సూర్యాపేట కలెక్టర్‌ గా తేజస్‌ నందన్‌ లాల్‌ పవార్‌ మహబూబ్‌ నగర్‌ కలెక్టర్‌ గా విజయేంద్ర బోయి,
వనపర్తి కలెక్టర్‌ గా ఆదర్శ్‌ సురభి
వరంగల్‌ కలెక్టర్‌ గా సత్యశారదాదేవి
నిర్మల్‌ కలెక్టర్‌ గా అభిలాషా అభినవ్‌ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ANN TOP 10