AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సత్తుమల్లేష్ పై కుట్ర?.. దుష్ప్రచార ఎజెండా అమలు చేస్తున్న కీలకనేతలు

దుష్ప్రచార ఎజెండా అమలుచేస్తున్న కీలకనేతలు

తమ ప్రమేయం లేకుండా ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్న పాతకాపులు

కాంగ్రెస్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన మల్లేష్

ఇతర పార్టీల్లో ఉండి.. కాంగ్రెస్ ను నియంత్రించే కుట్రలు

దుష్ప్రచారంపై సీఎంకు అందిన నివేదిక

(నిర్మల్ ప్రతినిధి, అమ్మ న్యూస్)
ఆదిలాబాద్ కాంగ్రెస్ నవ నిర్మాణంలో ఆయన కీలకభూమిక పోషించారు. ముఖ్యనేతలంతా పార్టీని వదిలివెళ్ళిన సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పిసిసి కార్యదర్శి సత్తుమల్లేష్ ఇటుక ఇటుక పేర్చి పార్టీని బలోపేతం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధులు కూడా దొరక్కూడదని, డిపాజిట్లు రాకూడదని.. ప్రత్యర్ధిపార్టీలు చేసిన కుట్రలు ఎప్పటికపుడు గమనిస్తూ పిసిసి అధ్యక్షుడి ఆదేశాలమేరకు ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్ళారు. ఇపుడు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం నేతలను సమన్వయం చేస్తూ ఎంతో నిబద్దతతో పనిచేశారు. పార్టీ నిబంధనల ప్రకారం ఇన్ ఛార్జిలకు బాధ్యతలు అప్పగించి.. ఎప్పటికపుడు అధిష్టానం సూచనలను వారికి చేరవేశారు. మంత్రి సీతక్కతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతంలో తన వంతు పాత్ర పోషించారు. అయినా పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్లు ఎంతో కష్టపడి పనిచేసినా.. కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేని నేతలు మల్లేష్ ను దెబ్బతీస్తే కాంగ్రెస్ ను దెబ్బతీసినట్లేనని భావిస్తూ రాష్ట్రంలోని ఏ పార్లమెంట్ లో లేని విధంగా దుష్ప్రచారానికి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తన జీవితంగా, ఆయన ఆదేశాలు పాటించే సైనికుడిగా దశాబ్దాలుగా నిబద్దతతో పనిచేస్తున్న సత్తుమల్లేష్ పై ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో పలువురు నేతలు విచిత్ర దుష్ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు అనుకూలమైన మీడియా ప్రతినిధులకు తప్పుడు సమాచారం ఇచ్చి దుష్ప్రచారం వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పలువురు పనిచేస్తున్నారని వీరిపై సీఎంకు నివేదికలు అందాయని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.

ఎందుకిలా..

మంత్రి సీతక్కకు రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. ఆమె కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలు, వ్యవహారాలు అన్నీ సాగాయి. తానే అభ్యర్ధిలా సీతక్క ఎంతో కష్టపడ్డారు. పిసిసి కార్యదర్శి సత్తు మల్లేష్ తో పాటు నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. అయితే.. నిర్మల్ జిల్లాలో ఆశించిన ఫలితం రాలేదు. ఇదే అదునుగా కొందరు ప్రత్యర్ధులు అధికారపార్టీని దెబ్బకొట్టాలన్న చిల్లర ప్రయత్నాలకు దిగుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాము చిన్న కుటుంబాల నుండి వచ్చామని, తమపై దుష్ప్రచారం తగదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మీడియాకు విజ్ఞప్తిచేశారు. అయినా కొందరు రెచ్చగొట్టి.. వీటిని పదేపదే ప్రచారం చేస్తుండడంతో కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మల్లన్నకు పరపతి ఉంటే.. కాంగ్రెస్ పచ్చగా ఉంటుందనో, లేదా తమ పెత్తనం సాగదనే భ్రమల్లో ఉన్న వారికి తప్ప ఇలాంటివి ఎవరికీ అవసరం లేదని.. ఇలాంటి పాతకాలపు రాజకీయాలు సదరునేతలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. ఒకరిని బద్నాం చేస్తే తమకు ఉపయోగం ఉంటుదని భావించే నేతల చిట్టా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉందని, ఇది పాతకాలపు రాజకీయం కాదని.. రేవంత్ రెడ్డి కాలం అని నేతలు అంటున్నారు. నిజాయితీ, నిబద్దత, కాంగ్రెస్ పార్టీ విస్తరణ, విజయాలు, పార్టీ భవిష్యత్తే లక్ష్యంగా నిద్రాహారాలు మాని.. నిఖార్సైన శ్రమ చేసిన నాయకుడు సత్తుమల్లేష్ పై నిందలు వేయాలనుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

సీఎంకు నివేదిక
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాలు, మండలాల వారీగా పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. ఎవరు పనిచేశారు.. ఎవరు ద్రోహం చేశారు. ఎవరు చిల్లర ప్రచారానికి దిగి పార్టీకి నష్టం చేస్తున్నారు? చెడుప్రచారాలు వ్యాప్తిలో పెడుతున్నారు అన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి నివేదిక అందింది. నేతలందరినీ సమన్వయం చేసి పార్టీని పటిష్ట స్థితికి చేర్చిన సత్తుమల్లేష్ పై దుష్ప్రచారం చేస్తే ఖబడ్దార్ అని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. వేరే పార్టీల్లో ఉండి కాంగ్రెస్ పార్టీని నియంత్రించే కుట్రలు సాగవని అంటున్నారు.

ANN TOP 10