AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపే మోదీ ప్రమాణం..

వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. నరేంద్ర మోదీతోనూ, మంత్రివర్గ సభ్యులతోనూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరి భేటీ దాదాపు అరగంట పాటు సాగింది. అనంతరం చంద్రబాబు… అమిత్ షాను కలిశారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం అనంతరం చంద్రబాబు టీడీపీ ఎంపీలను కలిశారు. ఎన్డీయే పెద్దలతో సమావేశం వివరాలను చంద్రబాబు తమ ఎంపీలతో పంచుకున్నారు.

ANN TOP 10

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి..