AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బైక్ మెకానిక్ షాప్ లో అగ్ని ప్రమాదం.. 18 బైకులు దగ్ధం

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ మెకానిక్ షాప్ లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద అర్జున్ చౌహన్ బైక్ పాయింట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. దీని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 18 బైకుల వరకు దగ్ధమయ్యాయని షాప్ యజమాని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

ANN TOP 10