ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో అరవింద్ కేజ్రీవాల్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. జైలుకు వెళ్లేందుకు ఆయన రాజ్‌ఘట్‌ను సందర్శించారు. మహాత్మా గాంధీ సమాధి దగ్గర కేజ్రీవాల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీ మద్యం కుంభ కోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను తీహార్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో మే 10వ తేదీన ఆయనకు సుప్రీంకోర్టు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక మే 2వ తేదీ మళ్లీ తీహాడ్ జైలులో లొంగిపోవాలంటూ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదే విధంగా ఆయన మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై జూన్ 5న నిర్ణయం తీసుకోనుంది.









