నా వద్ద ఆధారాలు ఉన్నాయ్..
ఏ ఫ్లైట్‌లో వెళ్లారో.. ఎక్కడ కలిశారో నిరూపిస్తా
కేసీఆర్ రాక్షసుడు.. నీచమైన ట్యాపింగ్ చేయించారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మాజీ మంత్రి హరీశ్‌రావు అమెరికాలో కలిశారని అన్నారు. ఆయనను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లారన్నారు. ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పి వచ్చారని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఏ ఫ్లైట్‌లో వెళ్లారో.. ఎక్కడ కలిశారో నిరూపిస్తా మన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీశ్‌రావు ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. తాను దేనికైనా సిద్ధమే అన్నారు. కేసీఆర్ రాక్షసుడు అని నీచమైన ఫోన్ ట్యాపింగ్ చేయించారని సీరియస్ అయ్యారు.









