AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్యాలెట్‌ బాక్స్‌లో పట్టభద్రుల తీర్పు.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం

మధ్యాహ్నం 2 గంటల వరకు 49.26 శాతం పోలింగ్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఖమ్మం – వరంగల్‌ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.26 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నిక ఫలితం జూన్‌ 5వ తేదీన వెలువడనుంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.

బరిలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి పోటీపడుతున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రాడ్యుయేట్స్‌ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు.

ANN TOP 10