AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫైన‌ల్లో చెత్తాట‌.. ఆ రెండు రికార్డులు స‌న్‌రైజ‌ర్స్‌వే..!

ప‌దిహేడో సీజ‌న్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టైటిల్ పోరులో చెత్తాటతో నిరాశ‌ప‌రిచింది. మెరుపు బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను భ‌య‌పెట్టిన హైద‌రాబాద్ బ్యాట‌ర్లు కీల‌క మ్యాచ్‌లో కాడి ఎత్తేశారు.దాంతో, చెపాక్ స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(kkr) బౌల‌ర్ల‌కు బ‌దులివ్వ‌లేక క‌మిన్స్ సేన‌ 113 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది.

త‌ద్వారా, ఐపీఎల్ ఫైన‌ల్‌ చ‌రిత్ర‌లోనే అత్య‌ల్ప స్కోర్ న‌మోదు చేసిన జ‌ట్టుగా స‌న్‌రైజ‌ర్స్ రికార్డు మూట‌గ‌ట్టుకుంది. దాంతో, 2013లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పేరిట 125 ప‌రుగుల‌తో ఉన్న రికార్డు బ‌ద్ద‌లైంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోర్‌తో రికార్డు నెల‌కొల్పిన స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్లో లో స్కోర్ కొట్టిన జ‌ట్టుగా నిలిచింది. దాంతో, ఈ మెగా టోర్నీలో రెండు రికార్డుల‌ను స‌న్‌రైజ‌ర్స్ త‌న ఖాతాలో వేసుకుంది.

ANN TOP 10