AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ చెప్పేవన్నీ అవాస్తవాలే..

బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
పంట నష్టపోయిన రైతులకు కేంద్రం సాయంపై సీఎం కేసీఆర్‌ అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. తెలంగాణ రాష్ట్రానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల రూపంలో 2021 -2022 సంవత్సరానికిగానూ కేంద్రం 75 శాతం వాటాగా దాదాపు రూ. 359 కోట్లు ఇస్తే.. ఒక్క రూపాయి ఇవ్వలేందటూ సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ కౌంటర్‌ ఇచ్చారు.

2021 -2022 సంవత్సరానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల్లో రాష్ట్రవాటా కేవలం 25 శాతం మాత్రమేనని, అంటే సుమారు రూ.120 కోట్ల కేంద్రం నిధులతో కలిపి ఖర్చుపెట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదని రఘునందన్‌ అన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.359 కోట్ల నిధులనే రెండు విడతలుగా పంట నష్టపోయిన రైతులకు చెల్లించారని, ఇప్పుడేమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ కేసీఆర్‌ విమర్శిస్తున్నారని రఘనందన్‌ అన్నారు.

ANN TOP 10