AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాంచీలో ఓటుహక్కు వినియోగించుకున్న ధోనీ..

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ బూత్‌ వద్దకు వచ్చిన ధోనీ అక్కడ తన అమూల్యమైన ఓటు వేశారు. బ్రౌన్‌ కలర్‌ ఫుల్‌ నెక్‌ టీషర్ట్‌తో పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన ధోనీని చూసిన స్థానికులు మిస్టర్‌ కూల్‌తో మాట్లాడేందుకు ఎగబడ్డారు. దీంతో పోలీసుల భద్రత మధ్య ధోనీ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మరోవైపు దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్‌ జరుగుతున్నది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు.

ANN TOP 10