AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈ-సెట్ (తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఈసెట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల 330 మంది విద్యార్థులు ఈ సెట్ రాయగా.. వారిలో 22 వేల 365 మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు లింబాద్రి వెల్లడించారు.

తెలంగాణ (Telangana) ఈ సెట్‌లో 95.86% శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారన్నారు. ఈ సెట్ బీఎస్సీ మ్యాథ్స్‌లో పెద్దపల్లికి చెందిన యాదగిరి మొదటి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ సెట్ కెమికల్ ఇంజనీరింగ్‌లో ఏపీకి చెందిన మనోహర్ మొదటి ర్యాంక్ సాధించారన్నారు. ఈసెట్‌లో క్వాలిఫైన వారికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ అభినందనలు తెలియజేశారు. జూన్ 2 నుంచి ఈ సెట్ అడ్మిషన్లు మొదలవుతాయని లింబాద్రి వెల్లడించారు.

కాగా.. ఈనెల 6వ తేదీన తెలంగాణ ఈసెట్ పరీక్షను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 99 కేంద్రాలను ఏర్పటు చేశారు. మొత్తం 200 మార్కులకు గానూ ఆన్‌లైన్ విధానంలో ఈ రాత పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు ఈ పరీక్ష జరిగింది.

ANN TOP 10