AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్‌ షాక్‌.. జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్‌ రిమాండ్‌ను మరోసారి పొడిగించారు. సీబీఐ కేసులో జూన్‌ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న విషయం విదితమే.

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్‌ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్‌ కోసం ఆమె తరుపు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ పలుమార్లు ఆమెకు బెయిల్‌ రిజెక్ట్‌ అయ్యింది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును నేడు న్యాయస్థానం పరిగణలోకి తీసుకొని విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెకు సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో మరో 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగిస్తూ తుది తీర్పు వెల్లడించారు.

ANN TOP 10