రహదారి భద్రతా చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వానాకాలంలో ఏర్పడే రోడ్డు డ్యామేజీలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సచివాలయంలో హైదరాబాద్ విజయవాడ హైవే, సిటీ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి ఈఎన్సీ గణపతి రెడ్డి, జాతీయ రహదారుల రీజినల్ ఆఫీసర్ రజాక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్యామేజీ పనుల్లో స్పీడ్ పెంచాలని మంత్రి అన్నారు. రోడ్లపై లాగిన్ పాయింట్లు రిపేర్లపై చర్చించారు. వానాకాలంలో ముందస్తు చర్యలపై ప్రజలకు సూచనలు చేయాలన్నారు. పెండింగ్ ఫ్లైఓవర్ నిర్మాణం, చిన్న వర్షానికి రోడ్లపై నిలుస్తున్న వరదల గురించి.. దానికి ఎలా పరిష్కారం చేయాలనే విషయంలో గైడ్ చేశారు. 17 బ్లాక్ స్పాట్స్ పై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది.
