టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ సినిమాల్లో నటిస్తుండగా.. ఆ తర్వాత సలార్ 2కి సిద్ధమవ్వనున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశాడు. డార్లింగ్ ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఆయన రాసుకొచ్చాడు. దీంతో ఆ పోస్టు ప్రభాస్ మ్యారేజ్ గురించి అయి ఉంటుందేమో అని సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. స్పెషల్ పర్సన్ అంటే ఓ లేడీని పరిచయం చేయబోతున్నాడని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. అయితే సినిమా గురించి ప్రభాస్ కామెంట్ చేశారని కొందరు అనుకుంటుండగా.. మరి కొందరు మ్యారేజ్‌కు సంబంధించిన హింట్ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ గురించి ప్రభాస్ అభిమానులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
