AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందరం సంవయనం పాటిద్దాం: ఆత్రం సుగుణ

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు, సబ్బండ వర్గాలు సంవయనం పాటించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కోరారు. ఎవరూ ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని ఆత్రం సుగుణ ఓ ప్రకటనలో తెలియజేశారు. బీజేపీ కుల మతాల పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కావున పార్టీ శ్రేణులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేలా సహకరించాలని కోరారు. సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. విద్వేషాలు వీడి అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆత్రం సుగుణ పేర్కొన్నారు.

ANN TOP 10