AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘సీఏఏ కూడా మోడీ గ్యారంటీ’.. మోడీ సంచలన వ్యాఖ్యలు

ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. గురువారం ఉత్తర ప్రదేశ్‌ అజాంఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మోడీ వెళ్లిపోతే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ సీఏఏ మోడీ గ్యారంటీ అంటూ కామెంట్స్ చేశారు. దానిని ఎవరూ తొలగించలేరన్నారు. మోడీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉందని, సీఏఏ చట్టమే గ్యారెంటీకి తాజా ఉదాహరణ అని చెప్పారు. సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వడం మొదలైందన్నారు. దేశంలో వీళ్లంగా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారని, ఉత్తర్ ప్రదేశ్‌లోను లక్షలాది శరణార్థలున్నారన్నారు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్‌ రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోందని, అదే ఫిర్‌ ఏక్‌ బార్‌.. 400 పార్‌ అన్నారు. మోడీ గ్యారెంటీ కశ్మీర్‌లోనూ కనిపిస్తోందని, అక్కడ శాంతికి గ్యారెంటీ ఇచ్చామని అన్నారు.

కమలం వికసిస్తేనే.. అభివృద్ధి మళ్లీ ఖాయం

కశ్మీర్‌లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయని, మోడీ వెళ్తే ఆర్టికల్‌ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాల్గొ దశలో జరిగిన పోలింగ్‌లో శ్రీనగర్‌ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని, ఉచితంగా రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. పేదల బాధలన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పేలుళ్లు, ఉగ్రవాది జరిగినా ప్రజలు అజాంఘడ్ గురించి చర్చ జరిగేదన్నారు. స్లీపర్ సెల్స్ పై చర్చ జరిగేదన్నారు. ఇండియా కూటమి నేతలు పేదల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలనుకున్నారని మండిపడ్డారు. 70 ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజన రాజకీయాలు చేశారని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్‌ గురించి ఆలోచించలేదన్నారు. ఆజాంఘడ్‌లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ANN TOP 10