హైదరాబాద్: అతివేగంగా కార్లు నడుపుతూ ఉంటారు. ఒక్కోసారి వేగం కంట్రోల్ అవక బండి బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనే ఇవాళ ఉదయం బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బేగంపేట ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రావెల్స్ బస్సును ఢీకొని రివర్స్‌లో ఫ్లై ఓవర్ వాల్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులోని డ్రైవర్‌తో సహా మహిళకు గాయాలయ్యాయి. బేగంపేట ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
