AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెట్టింగులో రూ. 2 కోట్లు పోగొట్టడంతో ఇనుప రాడ్డుతో కొట్టిచంపిన తండ్రి

బెట్టింగులో రూ. 2 కోట్లు పోగొట్టడంతో కడతేర్చిన తండ్రి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత పల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొడుకు తండ్రి మాట వినకుండా జల్సాలు, బెట్టింగులకు పాల్పడి ఉన్న భూమిని అమ్మేశాడు.

ఇటీవల కాలంలో చాలా మంది జల్సాలకు అలవాటు పడుతున్నారు. సరదాగా ఆటలాడుతూ జీవితాలనే శిథిలం చేసుకుంటున్నారు. ఆన్ లైన్ బెట్టింగుల పేరుతో రూ. కోట్లుపోగొట్టుకుంటున్నారు. దీంతో కుటుంబం కకావికలంగా మారుతోంది. బెట్టింగులకు అలవాటు పడి ఉన్న ఆస్తినంతా అమ్మేసుకుంటున్నారు. వద్దని వారించినా వినకుండా దారి తప్పుతున్నారు. ఫలితంగా ప్రాణాలే తీసుకుంటున్నారు.

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత పల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొడుకు తండ్రి మాట వినకుండా జల్సాలు, బెట్టింగులకు పాల్పడి ఉన్న భూమిని అమ్మేశాడు. ఇందులో సుమారు రూ. 2 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు. అయినా అతడి తీరు మారలేదు. ఇప్పటికైనా మారాలని తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరకు ఆ తండ్రే తనయుడిని హతమార్చాడు.

ANN TOP 10